పండుగ పూట పస్తులు ఉంచడం సరికాదు

by Elthuri vijay kumar |

గత మూడు నెలలుగా వేతనాలు అందక గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారని, కనీసం ఈ దసరా పండుగ పూటైన పస్తులు ఉంచకుండా మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కో కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు.

పండుగ పూట పస్తులు ఉంచడం సరికాదు
X

పండుగ పూట పస్తులు ఉంచడం సరికాదు

మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలి

సీఐటీయూ జిల్లా కో- కన్వీనర్ చంద్రశేఖర్

జగిత్యాల కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

దిశ, జగిత్యాల, రూరల్: గత మూడు నెలలుగా వేతనాలు అందక గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారని, కనీసం ఈ దసరా పండుగ పూటైన పస్తులు ఉంచకుండా మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కో కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సీఐటీయూ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జగిత్యాల జిల్లా కో- కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగ జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి గ్రామపంచాయతీ కార్మికులు మరణిస్తే వారికి రూ.20 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్జీ చేశారు. జీవో నెం. 51 ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి పులి మల్లేశం నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story