అవినీతి పరులు నీతి మంతులుగా వాఖ్యలు చేయడం విడ్డూరం

by Ratna Kumari |

అవినీతి పరులు కూడ నీతి మంతులుగా వాఖ్యలు చేయడం చాలా విడ్డూరం అని 26 వ డివిజన్ కార్పోరేటర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మండి పడ్డారు.

అవినీతి పరులు నీతి మంతులుగా వాఖ్యలు చేయడం విడ్డూరం
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న చందంగా ఇవాళ అవినీతి పరులు కూడ నీతి మంతులుగా వాఖ్యలు చేయడం చాలా విడ్డూరం అని 26 వ డివిజన్ కార్పోరేటర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మండి పడ్డారు. యూఐడీఎఫ్ నిధుల టెండర్లు రద్దు చేయబడ్డాయని.. వాటిలో మా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు ఉచ్ఛరిస్తూ అన‌వ‌స‌ర‌పు ఆరోపణలు చేస్తున్న మాజీ మేయర్ సర్థార్ రవీంద‌ర్ సింగ్ పై అంజన్ కుమార్ ద్వజమెత్తారు. గత రెండు మూడు రోజులుగా పత్రికల్లో యుఐడీఎఫ్ నిధులు రద్దు చేయబడ్డాయని ఆరోపణలతో వస్తున్న‌ వార్తలు పూర్తిగా అవాస్తవం అని వెల్లడించారు.

మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనవసరపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సంబంధిత నిధులకు సంబంధించి వాటి పనుల టెండర్లకు సంబంధించి మంత్రికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. నిధులను రద్దు చేయమని, టెండర్లను క్యాన్సల్ చేయాలని మంత్రి ఎక్కడా చెప్పలేదన్నారు. నూతనంగా విలీనం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధి చెందాలని.. నిధులను వినియోగించుకోవాలని తెలిపారే తప్పా ఎక్కడ వీటికి వ్యతిరేక స్వరం వినిపించలేదని తెలిపారు. పలువురు కార్పోరేటర్లు తమ డివిజన్ల అభివృద్ధి కొరకు ఆర్జీలు పెట్టుకోవాలని... వాటిని వినియోగం చేసుకోవాల‌ని సూచనలు చేశారని తెలిపారు.

అనవసరమైన రాద్ధాంతం చేస్తూ అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సర్ధార్ రవీంధర్ సింగ్ మీ ప్రవర్తన మార్చుకో మా మంత్రి పై అనవసరపు ఆరోపణలు చేస్తే ఊరుకొమని హెచ్చరించారు. సెక్యులర్ పార్టీలో ఉండి మొన్నటి మేయర్ ఎన్నికలో నీ పాత్ర నీ ప్రమేయం నగర ప్రజలందరికీ తెలుసని మండి పడ్డారు. మీరు ఏ రకంగా మద్దతు తెలిపి బీజేపితో కుమ్మక్కైయ్యారో నగర ప్రజలందరికీ తెలుసని. చర్చించుకుంటున్నారని ద్వజమెత్తారు. మీరు చేసిన సైలెంట్ రాజకీయం ప్రజలకు తెలుసు అని, సిగ్గుతో తలదించుకోవాల్సిన రవీందర్ సింగ్ నీతులు మాట్లాడితే.. దయ్యాలు వేదాలు పలికినట్లు ఉందని ద్వజమెత్తారు. అనవసరపు ఆరోపణలు చేస్తే.. ఊరుకునేది లేదన్నారు. తగిన బద్ది చెబుతామని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ హెచ్చరించారు.

Next Story