- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ : డీడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం
సమాజంపై అవగాహన లేక గ్రామాల్లో బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని డీడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, డీఎస్పీ నాగేంద్ర చారి పేర్కొన్నారు.

దిశ, గంభీరావుపేట : సమాజంపై అవగాహన లేక గ్రామాల్లో బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని డీడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, డీఎస్పీ నాగేంద్ర చారి పేర్కొన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దత్త సాయి ఫంక్షన్ హాల్లో డీడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో మంగళవారం బాల్య వివాహాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథులుగా డీడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, డీఎస్పీ నాగేంద్ర చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మాయిలు 18 సంవత్సరాలు వచ్చాక మాత్రమే వివాహం చేసుకోవాలన్నారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల వారికి పుట్టే పిల్లల్లో జన్యు పరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు.
బాలికలకు యుక్త వయస్సు వచ్చిన వెంటనే వివాహాలు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటున్నట్లు తెలిపారు. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో వారు అనేక కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కొంటారన్నారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పిల్లల దత్తత చాలా సులభం అని, ప్రభుత్వమే ఆ అవకాశం కల్పించినందున ప్రతి ఒక్కరు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, అలాగే చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, ఎమ్మార్వో మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, మెడికల్ ఆఫీసర్ అభినయ్, షీ టీం ప్రమీల, సీడీపీఓ ఉమారాణి, సూపర్ వైజర్ రేణుక, ఏపీఎం సుధా, ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు.






