అత్యాధునిక వైద్య స‌దుపాయం క‌ల్పించ‌డం అభినంద‌నీయం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-12 10:10:23  IST  )

క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే అత్యాధునిక వైద్య స‌ద‌పాయాల‌ను తీసుకొచ్చిన రెనే హాస్పిటల్ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బంగారి స్వామి, డా.ర‌జ‌నీ ప్రియ‌ద‌ర్శ‌ని ప్ర‌త్యేకంగా అభినందించారు

అత్యాధునిక వైద్య స‌దుపాయం క‌ల్పించ‌డం అభినంద‌నీయం
X

దిశ‌, కొత్త‌ప‌ల్లి : క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే అత్యాధునిక వైద్య స‌ద‌పాయాల‌ను తీసుకొచ్చిన రెనే హాస్పిటల్ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బంగారి స్వామి, డా.ర‌జ‌నీ ప్రియ‌ద‌ర్శ‌ని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆదివారం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తో క‌లిసి రెనే హాస్పిట‌ల్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెనే ఆసుప‌త్రిలో వాలిస్ కంపెనీకి చెందిన సుమారు రూ.5కోట్లు విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ స‌ర్జ‌రీ యంత్రాన్ని ఏర్పాటు చేయ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం అన్నారు. అత్యాధునిక వైద్య స‌దుపాయాలు జిల్లా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆసుప‌త్రి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బంగారి స్వామి, డాక్ట‌ర్ ర‌జినీ ప్రియ‌ద‌ర్శినిల‌ను అభినందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ డా.బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లి తండులైన కీర్తి శేషులు బంగారి లక్ష్మి, మైసయ్య పేరుపై ప్రతి సంవత్సరం సుమారు యాభై లక్షల రూపాయల విలువగల సర్జరీలను తాను, తన సతీమణి డా.రజని ప్రియదర్శిని చేస్తున్న‌ట్టు తెలిపారు. తాను ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ కుటుంబం అంతా వైద్య సేవకే అంకితం అని అన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిలో నుంచి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామని తెలిపారు.


మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేటీఆర్ తో పాటు క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మలాక‌ర్, మున్సిప‌ల్ మేయర్ కొల‌గాని శ్రీనివాస్, డిప్యూటీ మేయ‌ర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, కరీంనగర్ కార్పొరేటర్లు సరిల్ల రాజ కుమారి ప్రసాద్, సోమిడి వేణు, బండారి వేణు, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, పీస్ కమిటీ మెంబర్ అబ్దుల్ గఫార్ లయన్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బాధ్యులు జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బోయినపల్లి నర్సింగ రావు, లయన్స్ క్లబ్ నాయకులు కెప్టెన్ డా.బుర్ర మధుసూదన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహేందర్, సురేందర్, కరీంనగర్ IMA ప్రెసిడెంట్ డా.ఆకుల శైలజ, సెక్రటరీ డా.మహేష్ బాబు, THANA ప్రెసిడెంట్ డా.అనమల్ల నరేష్, సెక్రటరీ డా.వంశీధర్ రెడ్డి , రెనే హాస్పిటల్ వైద్యులు డా.నిఖిల్ లక్ష్మణ్, డా.కృష్ణా రెడ్డి, డా.సంధానం, డా. తులసీరాం, డా.శ్రీనివాస్, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లతో వాలిస్ కంపెనీ ప్రతినిధులు భాస్కర్, సంతోష్ పాల్గొన్నారు.

Next Story