- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ ప్రజలకు తెలంగాణ గ్యారెంటీ అని రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళ రాష్ట్రం లో నీతులు చెప్పడం సిగ్గుచేటని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మెంబర్ సుంకరి సంపత్ ఎద్దేవా చేశారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళ రాష్ట్రం లో నీతులు చెప్పడం సిగ్గుచేటని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మెంబర్ సుంకరి సంపత్ ఎద్దేవా చేశారు. స్థానిక ముకుంద లాల్ మిశ్రా భవన్ లో ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఉపాద్యక్షులు మాతంగి శంకర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా మహిళలకు నెలకు 2500, పెళ్లి చేసుకున్న నిరుపేదలకు పెళ్లి కూతురుకు తులం బంగారం, ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, దళితులకు 12 లక్షలు భరోసా కింద ఇస్తామని, తమ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికి తిరిగి హామీలు ఇవ్వడం జరిగిందన్నారు.
అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు ఈ హామీల అమలు కోసం కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదన్నారు. ఉపాధి హామీ పనికి 90% నిధులనుండి 60 శాతానికి కుదిస్తే రేవంత్ రెడ్డి ఎందుకని ప్రశ్నించలేదు ఎదిరించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఉపాధి హామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని మరి ఏ విధంగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తారని ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా , రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పేద ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణలో బాగా సాధించినమని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేడని అన్నారు. కేరళ రాష్ట్రం విద్యారంగానికి 24% శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర 8% శాతం మాత్రమే కేటాయించింది. కేరళ రాష్ట్రం వైద్య రంగానికి ప్రభుత్వ పరంలో ఉచితంగా అందిస్తే తెలంగాణలో వైద్యాన్ని వ్యాపారం చేస్తుంది.
కేరళ రాష్ట్రంలో ఉపాధిహామీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1000 బృ తిని అమలు చేస్తుంది .తెలంగాణ రాష్ట్రం ఉపాధిహామీ కార్మికులకు బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు, అభివృద్ధిలో కేరళ రాష్ట్రం తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఆమడ దూరంలో ఉందని అన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల మేనిఫెస్టో నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి పక్క రాష్ట్రాల్లో నీతులు చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలన్నీ అమలు చేసినవని కేరళ రాష్ట్రంలో చెప్పడం సిగ్గుచేటు అనే విషయమని అన్నారు. రైతుబంధు ఇప్పటికీ ఒక ఎకరానికి మాత్రమే వండింది. 10 ఎకరాల వరకు ఇస్తా అని చెప్పి అన్నావ్ బడ్జెట్ నిధులు ఎన్ని కేటాయించావు? కేరళ రాష్ట్రంలో ఐదు లక్షల ఇండ్లు నిర్మించి నిరుపేదలకు గృహప్రవేశం చేయించింది ఎర్రజెండా ప్రభుత్వం. తెలంగాణలో ఎన్నీ ఇందిరమ్మ ఇండ్ల ను పూర్తి చేశారో ప్రభుత్వ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఈ బడ్జెట్ లో కేటాయించిన అరకోరా నిధుల తో ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టో తో గ్రామ గ్రామాన వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతూ సమరశీల పోరాటాలకు ప్రజల్ని సన్నద్ధం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మిరాల రవి, బుర్ర రత్నాకర్ గౌడ్, బిస రాజు, కళ్యాణపు అంబాజీ పాల్గొన్నారు.






