- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం.. అనుమతుల మాటున అక్రమాలు
తంగళ్లపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల కొరకు రెవెన్యూ అధికారులు మానేరు వాగు నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నారు.

దిశ, తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల కొరకు రెవెన్యూ అధికారులు మానేరు వాగు నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్లలో ఇసుక తరలింపునకు అవకాశం ఇస్తూ, అధికారుల పర్యవేక్షణలో ఇసుక తరలింపు ప్రక్రియను సాఫీగా కొనసాగిస్తున్నారు.
అర్థరాత్రి వేళ అక్రమ లోడింగ్
అయితే అనుమతుల మాటున ఇసుక వ్యాపారులు అక్రమాలకు పాల్పడటం కలవరపెడుతోంది. అనుమతులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇస్తుండగా ట్రాక్టర్ యాజమానులు మాత్రం అర్ధరాత్రి వేళ అక్రమంగా ట్రాక్టర్లను వాగులో దింపి ఇసుక లోడ్ చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంతో పాటు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా..
ఇక్కడి ఇసుకను అధికారుల కళ్లుగప్పి జిల్లా సరిహద్దులు దాటిస్తూ.. అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ అక్రమ దందా మాత్రం నియంత్రణ కావడం లేదు. రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..మండల తహసీల్దార్
అక్రమంగా ఇసుక తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో తరచూ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాం. అయితే కొన్ని చోట్ల రాత్రివేళ ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం.






