- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికలో అక్రమాలను సరిదిద్దాలి
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించాలని, ప్రస్తుత ఎంపిక ప్రక్రియలో జరిగిన లోపాలను వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించాలని, ప్రస్తుత ఎంపిక ప్రక్రియలో జరిగిన లోపాలను వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో 3వ వార్డు కౌన్సిలర్ గందె శ్రీనివాస్, 4వ వార్డు కౌన్సిలర్ ప్రతాప్ తార తిరుమల్ రెడ్డిలు కమిషనర్‌ను కలిసి ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన నిరుపేదలను పక్కనబెట్టి, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారికి, అలాగే ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మందికి ఇళ్లను కేటాయించడం పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు."ముఖ్యంగా సమాజంలో ఆసరా అవసరమైన అనాథలు, వికలాంగులు, వితంతువుల వంటి నిరుపేద వర్గాలకు ఈ పథకంలో ప్రాధాన్యత దక్కకపోవడం బాధాకరమని, అర్హులైన ప్రతి పేదవానికి న్యాయం జరగాలని కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి కోరారు. అర్హులైన వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయాలకు, ఇతర ప్రభావాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా ఇండ్ల పంపిణీ జరగాలని, లబ్ధిదారుల ఎంపికపై ప్రజల్లో ఉన్న అనుమానాలను మున్సిపల్ యంత్రాంగం వెంటనే నివృత్తి చేయాలని వారు కోరారు.






