తొల‌గించిన జాబ్ కార్డుల‌పై విజిలెన్స్ అధికారుల విచార‌ణ

by Ratna Kumari |

గిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల తొలగించిన 52 జాబ్ కార్డ్స్ విషయమై మండల అధికారి కలెక్టర్ కు పిర్యాదు చేశాడు.

తొల‌గించిన జాబ్ కార్డుల‌పై విజిలెన్స్ అధికారుల విచార‌ణ
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల తొలగించిన 52 జాబ్ కార్డ్స్ విషయమై మండల అధికారి కలెక్టర్ కు పిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారి, జిల్లా అసిస్టెంట్ మేనేజర్ అధికారుల బృందం ఆధ్వర్యంలో విచారణ చేపట్టామని కోరగా.. మంగళవారం కథలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డ్స్ ల విచారణ చేపట్టారు. అనంతరం జాబ్ కార్డ్స్ రద్దు కాబడిన బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టగా అక్కడ బాధితులు చెప్పిన విషయాలకు అధికారులు విస్తూపోయారు. ఇటీవల డిమాండ్ తీసుకున్న జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ను మాత్రమే తొలగించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఆ తొలగించబడిన వ్యక్తులు గత సంవత్సరాల కాలంగా వారు ఎలాంటి పనులకు వెళ్లలేదని విచారణలో తేలింది. కానీ వారి విషయంలో డిమాండ్ ఎవరు తీసుకున్నారో అంతు చిక్కని విషయం.

జాబ్ కార్డుల‌ను తొల‌గించింది ఎవ‌రు..?

ఇక విచారణలో పాల్గొన్న అధికారులను అడగ్గా తెల్లమోహం వేశారు. అనంతరం ఈ విచారణ పాల్గొన్న జిల్లా స్థాయి అధికారులు వారిని మంద‌లిస్తూ బుధవారం సాయంత్రం లోగా జాబ్ కార్డ్స్ లో పేరు తొలగించిన వారి పూర్తి వివరాలతో పాటు వారి నుంచి సంజాయిసిని తీసుకుంటూ పూర్తి పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే.. మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అనే అనుమానం సగటు వ్యక్తికి కలగక మానదు. సాధారణంగా జాబ్ కార్డ్స్ ను తొలగించే అవకాశం కంప్యూటర్ నిర్వహకులకు, అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్స్, టెక్నికల్ సిబ్బందికీ మాత్రమే ఉంటుంది. కానీ ఈ ముగ్గురు సిబ్బంది కూడా ఇందులో తమ పాత్ర లేదని విచారణలో తెలిపారని సమాచారం. ఈ విచారణ లో అవసరం అయితే స్థానిక పోలీస్ లేదా సైబర్ డిపార్ట్మెంట్ కు కూడా పిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం లో విజిలెన్స్ అధికారి ఎం డి. వకీల్, అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story