- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్...
ధర్మపురి పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు.

దిశ, ధర్మపురి: ధర్మపురి పట్టణంలో రెండేళ్ల క్రితం ఏలేటి లక్ష్మణ్ అనే వ్యక్తి నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకువెళ్ళారు. దీనిపై బాధితు డు ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి శనివారం నిందితున్నీ అరెస్ట్ చేసి ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక సమాచారం, పలువురు వ్యక్తులను విచారించడం ద్వారా నిందితులు స్థానికంగా బిర్యానీ పాయింట్‌లో పనిచేసి అనంతరం తమ స్వరాష్ట్రమైన ఒడిశాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి కదలికలను సాంకేతిక ఆధారాల ద్వారా పక్కా స్కెచ్ వేసి ఒకరిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి వెండి అభరణాలను స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు..
జగిత్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో, ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి సూచనలతో, ధర్మపురి ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి రెహ్మాన్ బాక్స్ (30) అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి కేసుకు సంబంధించిన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై నిందితుడిని ధర్మపురికి తీసుకువచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేసి, మిగిలిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించి అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ధర్మపురి సీఐ ఎ.రాంనర్సింహా రెడ్డి, ఎస్సై జి. మహేష్, ఎస్సై-2 రవీందర్, పీసీ లు కిరణ్, రణధీర్‌లను జగిత్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, IPS డీఎస్పీ పురుషోత్తం రెడ్డి అభినందించి, ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.






