- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు మీరే..మాకు మేమే..రెండు వర్గాలుగా మండల బీజేపీ.?
మీకు మీరే మాకు మేమే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అయింది మండల బీజేపీ పార్టీ నాయకుల తీరు. వికసిత్ భారత్ లో భాగంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా చేపట్టిన కార్యక్రమాల నిర్వహణ ద్వారా పార్టీ విబేధాలు బయట పడ్డాయి.

దిశ,పెగడపల్లి : మీకు మీరే మాకు మేమే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అయింది మండల బీజేపీ పార్టీ నాయకుల తీరు. వికసిత్ భారత్ లో భాగంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా చేపట్టిన కార్యక్రమాల నిర్వహణ ద్వారా పార్టీ విబేధాలు బయట పడ్డాయి. దీనితో పార్టీలో ఉన్న కార్యకర్తలు అసలు పార్టీ లో ఏమి జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు.
అధ్యక్షుడు ఒక దగ్గర..మాజీ అధ్యక్షుడు మరొక దగ్గర..
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సోమవారం రోజున కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కర పత్రాల పంపిణీ తో పాటు మొక్కలు నాటే కార్యక్రమానికి మండల శాఖ సిద్ధం అయింది. అయితే ఇట్టి కార్యక్రమం కాస్త ప్రస్తుత అధ్యక్షుడు మండలం లోని మద్దులపల్లి గ్రామంలో నిర్వహించగా పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండల కన్వీనర్ మండల కేంద్రంలో నిర్వహించారు. దీనితో పార్టీ కార్యకర్తలు ఎటు వైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయో అనే సందిగ్ధంలో పడిపోయారు.
పదవుల పంపకంలో పైరవీలు..?
ఇటీవల ప్రకటించిన మండల కార్యవర్గ పదవుల్లో పైరవీలకే పెద్ద పీట వేసి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను విస్మరించారని డబ్బులు తీసుకుని జిల్లా అధిష్టానాన్ని తప్పు దోవ పట్టించి సీనియర్లను పక్కన పెట్టి పదవులను కేటాయించారని పార్టీలోని పలువురు పార్టీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గుస గుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి మండల స్థాయిలో వర్గ పోరు వల్ల ఎలాంటి ఫలితాలు వస్థాయో వేచిచూడాల్సిందే.






