పంచాయ‌తీ ఎన్నిక‌ల ఓట‌ర్ లిస్ట్ వినియోగం పై అధికారుల సూచ‌న‌లు

by Ratna Kumari |

దిశ, గంగాధర : గంగాధ‌ర మండ‌లంలోని అన్నిరాజ‌కీయ పార్టీల నాయ‌కులు, గ్రామ‌పంచాయ‌తీలు, స‌ర్పంచ్, వార్డు స‌భ్యుల అభ్యర్థుల‌కు మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారి స‌హాయ జిల్లా ఎన్నిక‌ల అధికారి

పంచాయ‌తీ ఎన్నిక‌ల ఓట‌ర్ లిస్ట్ వినియోగం పై అధికారుల సూచ‌న‌లు
X

దిశ, గంగాధర : గంగాధ‌ర మండ‌లంలోని అన్నిరాజ‌కీయ పార్టీల నాయ‌కులు, గ్రామ‌పంచాయ‌తీలు, స‌ర్పంచ్, వార్డు స‌భ్యుల అభ్యర్థుల‌కు మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారి స‌హాయ జిల్లా ఎన్నిక‌ల అధికారి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పోలింగ్ స్టేష‌న్ వారిగా ప్ర‌చురించిన ఓట‌ర్ లిస్ట్ ను మాత్ర‌మే వినియోగించాల్సిందిగా సూచించారు. ప్ర‌తి వార్డుకు సంబంధించిన ఓట‌ర్ల క్ర‌మ సంఖ్య 1 నుంచి ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇదే విధానం అమల్లో ఉంటుందని, సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శుల వద్ద ఈ వార్డు వారీ ఓటర్ లిస్ట్‌ల సాఫ్ట్ కాపీలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో పంపిణీ చేసే ఓటర్ స్లిప్‌లలో కూడా ఇదే వరుస సంఖ్య వ్యవస్థ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అయోమయాలు లేకుండా అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు దీనిని ఖచ్చితంగా పాటించాలని అధికార యంత్రాంగం సూచించింది.

Next Story