నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అని బంధువుల ఆందోళన

by Bhanu |

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అని బంధువుల ఆందోళన
X

దిశ, జగిత్యాల టౌన్ : డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న డెలివరీ కోసం జగిత్యాల ఎం సి హెచ్ ఆస్పత్రిలో చేరగా శనివారం బాబు పుట్టాడు. పుట్టిన నవజాత శిశువును చికిత్స నిమిత్తం తన ఆసుపత్రికి తీసుకురావాలని డ్యూటీ డాక్టర్ చెప్పడంతో తీసుకువెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రిలో బాబు మృతి చెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఆర్ఎంవో తెలిపారు.





Next Story