- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల సాయం రూ.7లక్షలకు పెంచాలి : జక్కని సంజయ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు అందజేస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని రూ. 7 లక్షలకు పెంచాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు అందజేస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని రూ. 7 లక్షలకు పెంచాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మార్కెట్‌లో సిమెంట్, స్టీల్ వంటి గృహ నిర్మాణ వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలతో ఇల్లు పూర్తి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించాలంటే లబ్ధిదారులు భారీగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై భారం పడకుండా ఉండాలంటే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి విడతలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొల్లిపాక క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్ పాల్గొన్నారు.






