అభివృద్ధిని చూసే కాంగ్రెస్ లో చేరిక‌లు : ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Nallavelli.Anjaneyulu |

దిశ, వేములవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప‌లువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌ని ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలోని

అభివృద్ధిని చూసే  కాంగ్రెస్  లో చేరిక‌లు : ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, వేములవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప‌లువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌ని ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలోని రుద్రంగి మండలం దేగావత్ తండా కి చెందిన ప‌లువురు బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కుసునోత్ బీరయ్య, గుగులోత్ బాలు, బిక్యా, రాజు, లక్క, తిరుపతి, భీమ, గజన్ లాల్, ప్రభాస్, పవన్, తిరుపతి, విజయ్ లతో పాటు సుమారు 30 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పార్టీలో చేరిన నాయ‌కులు పేర్కొన్నారు.

Next Story