పోక్సో కేసులో నిందితుడికి 3 నెల‌ల జైలు శిక్ష, రూ.1000 జ‌రిమానా

by Nallavelli.Anjaneyulu |

మైన‌ర్ బాలిక‌పై వేధింపులు, బ‌ల‌వంతంగా ప్ర‌వ‌ర్తించిన నిందితుడికి 3 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.1000 జ‌రిమానా విధించిన‌ట్టు సిరిసిల్ల పోక్సో కోర్టు జ‌డ్జీ రాధిక జైస్వాల్ శుక్ర‌వారం తీర్పు వెల్ల‌డించింది.

పోక్సో కేసులో నిందితుడికి 3 నెల‌ల జైలు శిక్ష, రూ.1000 జ‌రిమానా
X

దిశ, ఎల్లారెడ్డిపేట : మైన‌ర్ బాలిక‌పై వేధింపులు, బ‌ల‌వంతంగా ప్ర‌వ‌ర్తించిన నిందితుడికి 3 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.1000 జ‌రిమానా విధించిన‌ట్టు సిరిసిల్ల పోక్సో కోర్టు జ‌డ్జీ రాధిక జైస్వాల్ శుక్ర‌వారం తీర్పు వెల్ల‌డించింది. ఎస్పీ మ‌హేష్ బీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ మైన‌ర్ బాలిక‌ను 2020లో నిందితుడు మాచారెడ్డి మండ‌లం బంజాపల్లి గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ శంకర్ అనే వ్యక్తి మైనర్ బాలిక వెంట పడుతూ మాట్లాడమని బలవంతపు వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. అప్ప‌టి ఎస్.ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ప్రాసిక్యూషన్ తరపున పి.పి. పెంట శ్రీనివాస్ వాదించగా.. ఎల్లారెడ్డిపేట్ ఎస్ ఐ కే.రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,నవీన్ లు కోర్టులో 08 మంది సాక్షులను ప్రవేశ పెట్టీ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల పొక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ నింధితుడు అయిన సర్దార్ సింగ్ కి 03 నెలల జైలు శిక్ష విధిస్తూ 1000 రూపాయల జరిమానా విధించారు. ఈసందర్భంగా ఎల్లారెడ్డిపేట్ సి .ఐ ఓ .వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవ్వ‌రూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలీసులు , ప్రాసిక్యూషన్ల సంయుక్త వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సీఐ సూచించారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట్ ఎస్ఐ రాహుల్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్ నవీన్, శ్రీనివాస్, అప్పటి పోలీస్ అధికారులు ఎస్.ఐ వెంకటకృష్ణ ను ఎల్లారెడ్డిపేట్ సీఐ వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story