జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ బి. గితే

by Ratna Kumari |

దిశ, సిరిసిల్ల రూరల్ : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861ప్రకారం.. పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ బి.గితే తెలిపారు.

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ బి. గితే
X

దిశ, సిరిసిల్ల రూరల్ : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861ప్రకారం.. పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ బి.గితే తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డి.జే వినియోగించరాదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసు వారికి ఈ విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

Next Story