మత్స్యకారులకు నగదు బదిలీ అమలు చేయండి

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ అమలు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.

మత్స్యకారులకు నగదు బదిలీ అమలు చేయండి
X

దిశ, జగిత్యాల టౌన్ : రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ అమలు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. చేపల పెంపకం వృత్తిపై ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజ్ లకు ప్రతి ఏడాది చేప విత్తనం సకాలంలో అందకపోవడం, పంపిణీ చేసే పిల్లల పరిమాణం చిన్నగా ఉండడంతో చేపల పెరుగుదల ఆశించిన స్థాయికి చేరకపోవడం వల్ల మత్స్యకారులకు లాభం చేకూరడం లేదని పేర్కొన్నారు. ఉచిత పంపిణీ ఆగస్టు, సెప్టెంబర్ నాటికే పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం కారణంగా జగిత్యాల జిల్లాలోని 756 చెరువుల్లో ఇప్పుడు వరకు కేవలం 154 చెరువులకు మాత్రమే చేప పిల్లలు పంపిణీ కావడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం, చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ చేస్తే మత్స్యకార సంఘాలు స్వయంగా నాణ్యమైన విత్తనం కొనుగోలు చేసి సకాలంలో పోసుకునే వీలుంటుందని, అలాగే మత్స్యకార సంఘాలు లేని గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story