తాండ్రియాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో కొందరు అక్రమంగా ఇసు

తాండ్రియాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో కొందరు అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు. మండలంలో ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాబడికి గండి కొడుతూ కోట్లు విలువ చేసే సహజ సంపద పక్క జిల్లాలకు తరలుతున్న అధికారులు మాత్రం స్పందించకపోవడం శోచనీయం. అలాగే రాత్రి వేళల్లో ఇసుక ట్రాక్టర్లు అతి వేగంతో ప్రయాణించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు అనేక ఇబ్బందులతో పాటు భయందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇసుక వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Next Story