- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవి నుంచి యధేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ లక్షలాది రూపాయలు విలువ చేసే అడవి మట్టిని మంథనిలో అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని వ్యకాస జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ లు ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, మంథని : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ లక్షలాది రూపాయలు విలువ చేసే అడవి మట్టిని మంథనిలో అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని వ్యకాస జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ లు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా అడవి లో ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్న చూసి చూడనట్టు వ్యవరిస్తున్న రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతి నిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు కూడా వెళ్లువెత్తున్నాయని వాపోయారు. మంథని మండల పరిధి లోని ఫారెస్ట్ గాడుదుల గండి శివ్వారం మొసల్ల అభయ్యారణ్యం సమీపంలో ఆదివారం అక్రమ మట్టి తరలింపునకు కొందరు మట్టి వ్యాపారులు ఎలాంటి అనుమతి లేకుండా వందలాది మట్టి ట్రాక్టర్ ట్రిప్పులు తరలిస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
గత కొద్ది ఆదివారాల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం అధికారుల దృష్టికి పోయిన ట్రాక్టర్ లను సీజ్ చెయ్యకపోవడం పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం అర్థమవుతుంది.రెవెన్యూ అధికారుల తీరు మాముళ్లు ముడితే చాలు ఎన్ని ట్రిప్పులు ఎంతైనా ఎపుడైనా తరలించు కోవచ్చు అన్నట్లు వ్యవరిస్తున్నారు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు. ప్రకృతి సంపదను కాపాడకుండా అడవి వైపు కన్నెత్తి చూడడటం లేదు. అడవిలో మట్టి అక్రమంగా తరలిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు, ,రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తుండటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. మట్టి అక్రమ రవాణా పై ఉన్నతాధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాలని కోరుతున్నారు.






