- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులే సూత్రధారులు.. నిండా మునిగిన అమాయకులు
కంచే చేనుమేస్తే అన్న చందంగా తయారైంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మి గాయత్రి ఫాం ల్యాండ్ వ్యవహారం. మొక్కలు నాటకపోయినా లే అవుట్ చేయకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించారు.

దిశ బ్యూరో, కరీంనగర్: కంచే చేనుమేస్తే అన్న చందంగా తయారైంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మి గాయత్రి ఫాం ల్యాండ్ వ్యవహారం. మొక్కలు నాటకపోయినా లే అవుట్ చేయకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించారు. అమాయకులకు అంటగట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. వెంచర్ లో ప్లాట్లు కోనుగోలు చేసిన అమాయక ఉద్యోగులు ఏళ్లు గడచిన మొక్కలు నాటింది లేదు చెట్లు పెంచింది లేదు కొందరు అధికారులు అమాయకులకు ప్లాట్లను అంటగట్టి నజరానాగా ప్లాట్లు పొందడం, పొందిన ప్లాట్లలో అక్రమదందాలు చేయడం లక్షలు గడించడం వారి తంతుగా మారగా లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన ఉద్యోగులకు మాత్రం పైసా లాభం లేక అమ్మినా కొనేవారు లేక అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది లక్ష్మి గాయత్రి ఫాం ల్యాండ్ లో పెట్టుబడులు పెట్టిన అమాయకుల పరిస్థితి.
అధికారులే సూత్రధారులుగా అక్రమ వెంచర్
అమాయక జనం నుంచి లక్షల పెట్టుబడి పెట్టించి నజరానాగా ప్లాట్లు దక్కించుకున్న అధికారుల భాగోతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. అధికారిక అనుతులు లేకపోయినా లే అవుట్ చేయకుండా అమాయక ఉద్యోగులు వ్యాపారస్తులకు భూమి రేటు పెంచి విక్రయించేందుకు లక్ష్మి గాయత్రి ఫారం ల్యాండ్ పేరిట పేపర్లపై మ్యాజిక్ చేసి రంగు రంగు బ్రోచర్లతో అమాయక జనాన్ని బోల్తా కోట్టించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు వెంచర్ నిర్వాహకులు. అందుకు నజరానా ప్లాట్లు పొంది లాభపడుతుంటే డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారికి మాత్రం పైసా లాభం లేకపోవడంతో మోసపోయాం అని గుర్తించిన కొనుగోలు దారులు అమ్మేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుంది పైగా నయానో భయానో ఆ భూమిని కొట్టేసేందుకు కొంతమంది అధికారులు ఇతర అమాయకులపై ఒత్తిడి పెంచి వాటిని సైతం వారు సాంతం చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో వెంచర్ అక్రమ భాగోతం వెలుగుచూసింది
అక్రమ వెంచర్ లో అందరు అధికారులే
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన లక్ష్మి గాయత్రి ఫాం లాండ్ వ్యవహరం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. అందరు అదికారులే సూత్రధారులుగా అమ్మకాలు జరుగగా నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూమి గుంటల్లో రిజిస్ట్రేషన్లు చట్ట విరుద్దం అయినప్పటికీ గుంటల చొప్పున అమ్మకాలు కోనుగోల్లు జరిగినా వాటిని అధికారులు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అయితే ఆ వెంచర్ వెలిసిన సమయంలో అక్కడ పనిచేసిన ఓ మండల స్థాయి అధికారి సూత్రధారులుగా వెంచర్ వెలిలిసింది అనే విమర్శలు వెల్లువెక్తుతున్నాయి. అందుకు గాను సదరు అధికారులకు ఆ వెంచర్ లో పలు ప్లాట్లు కేటాయించినట్టు జనం బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అధికారులు సూత్రధారులుగా ఉండటంతో తొండలు గుడ్లు పెట్టని ఆ భూమికి లక్షల రూపాయలు ధర పలికిందని అది నమ్మి కొనుగోలు చేసిన అమాయకులు నిండా మునిగారు అనేది స్థానికంగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం .






