మంథనిలో ఆగని అక్రమ మట్టి దందా..!

by Ratna Kumari |

మంథనిలో అక్రమ మట్టి రవాణా నిర్వాహకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని ఆదివారం వేళల్లో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేని సమయంలో అక్రమ మట్టి ట్రాక్టర్ల రవాణా తంతు కొనసాగుతుందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

మంథనిలో ఆగని అక్రమ మట్టి దందా..!
X

దిశ, మంథని : మంథనిలో అక్రమ మట్టి రవాణా నిర్వాహకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని ఆదివారం వేళల్లో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేని సమయంలో అక్రమ మట్టి ట్రాక్టర్ల రవాణా తంతు కొనసాగుతుందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఆదివారం నాడు మంథని ప్రాంతంలోని అటవీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న మట్టి మాఫియా అంటూ వివిధ పత్రికా ప్రకటనలు వచ్చినప్పటికి రెవెన్యూ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారుల తనిఖీలు లేకపోవడం అదును చూసుకొని తిరిగి ఈ ఆదివారం సైతం మట్టి అక్రమ రవాణా కొనసాగింది ఈ అక్రమ మట్టి రవాణా కు అడ్డుకట్ట వేసేవారు కరువయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా మంథని ప్రాంతంలో చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలు, కొల్లగొడుతూ, ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల కళ్లేదుటే జోరుగా మట్టిని తరలిస్తున్నారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం అధికారుల దృష్టికి పోయిన ట్రాక్టర్ లను గుర్తించి సీజ్ చెయ్యకపోవడం పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అర్ధమవుతుతుంది.మంథని ప్రాంతంలో రెవెన్యూ అధికారులు అక్రమ మట్టి ట్రాక్టర్ లను సీజ్ చెయ్యకుండా క్షేత్రస్థాయిలో మట్టి మాఫియా ను కట్టడి చెయ్యడం లో విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రకృతి సంపద ఐనా మట్టిని అక్రమ మట్టి మాఫియా నుంచి అరికట్టాలని అడవిని తోడిన వారితో పాటు అక్రమ మట్టి చేరావేస్తున్న మట్టి ట్రాక్టర్ లను, జేసీబీ లను గుర్తించి సీజ్ చేసి అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ఓ ప్రకటనలో కోరారు.

Next Story