కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయి : వొడితల ప్రణవ్

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు కచ్చితంగా ఉంటుందని, పదవులు వాటంతట అవే వస్తాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయి : వొడితల ప్రణవ్
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు కచ్చితంగా ఉంటుందని, పదవులు వాటంతట అవే వస్తాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో హుజురాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి, వొడితల ప్రణవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నాయకులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ గాంధీ, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. గతంలో యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన వారు ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నారని, హుజురాబాద్‌లో కూడా కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంలో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకమని రాబోయే రోజుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ రోషిణి, ఉపాధ్యక్షుడు థామస్, జిల్లా ఇంచార్జి జవహర్, జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, ఐదు మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Next Story