- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ముంటే రాజీనామా చేయ్.. మళ్లీ పోటీ చేద్దాం
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. తన తండ్రి విద్యాసాగర్ రావు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఏ-క్లాస్ కాంట్రాక్టర్ అని నీలాగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అవ్వలేదని ఎద్దేవా చేశారు. జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీకేం బాధ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా మెడికల్ కాలేజీ జిల్లా ప్రజలందరిదని, అక్కడ చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన వైద్యం, విద్య అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జగిత్యాలకు మెడికల్ కాలేజీ రాలేదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారమే మెడికల్ కాలేజీలు వస్తాయన్న విషయం ఒక డాక్టర్ అయ్యుండి నీకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే ఆరోగ్యం విషయంలో ట్రీట్మెంట్ కై హైదరాబాద్ వెళుతున్నప్పుడు కోరుట్ల ప్రజలు జగిత్యాలకు వస్తే తప్పేముంది అన్నారు.
కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ఇనాగరేషన్ పూర్తయి రెండేళ్ల అవుతుందని మెట్పల్లి 30 పడకల ఆసుపత్రి 80% గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఆసుపత్రికి స్టాఫ్ కేటాయించడం లేదని విమర్శించారు. అభద్రతా భావంతో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయని దొంగలాగా బయట తిరిగితే ఏం తెలుస్తుందన్నారు. వ్యక్తిగత స్వలాభం కోసం జగిత్యాల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దమ్ముంటే పదవికి రాజీనామా చేసి జగిత్యాలలో తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. సీఎం ను నువ్వు కలిపించడం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా అవసరమైతే సీఎంను తానే కలుస్తానని స్పష్టం చేశారు. సన్న వడ్లకు బోనస్, కెసిఆర్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని హితవు పలికారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, జగిత్యాల ఎమ్మెల్యే తన తండ్రిపై మాట్లాడినా తాను మాత్రం వారి కుటుంబంపై ఎప్పటికీ మాట్లాడనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ లీడర్లు మారు సాయి రెడ్డి, దారిశెట్టి రాజేష్,దశరథ్ రెడ్డి,లక్ష్మారెడ్డి,ఫహీం,భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.






