- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ హోదాలో వివరాలు అడిగితే సమాధానం చెప్పరా?
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుగా శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరి పై అసహనం వ్యక్తం చేశారు.

ఎంపీ హోదాలో వివరాలు అడిగితే సమాధానం చెప్పరా?
రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్, ఎయిర్ పోర్ట్ వివరాలు అడిగితే ఎందుకు స్పందించరు?
ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు.?
*ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుగా శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరి పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్ పోర్ట్ వివరాలు అడిగితే నా దగ్గర లేవు అనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం మెసేజ్ లు చేసిన రిప్లై ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ శ్రీహర్ష పై ఎంపీ వంశీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిస్తే ఎందుకు స్పందించడం లేదని ఎంపీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రశ్నించారు. రామగుండం ఎయిర్ పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ హోదా లోనే వివరాలు అడిగితే ఇవ్వలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నికైన నేను ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాసేవ చేసేందుకే ఎంపీగా ఉన్నానని కలెక్టర్ పై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలనేది రిక్వెస్ట్ కాదని కలెక్టర్ గా మీ బాధ్యత అని గుర్తుకు చేశారు. ఎవరైనా ఎంపీ చెప్పిన పనులకు చేయొద్దని నిబంధనలు ఏమైనా పెట్టారా అని కలెక్టర్ ను ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష కి ఏమి సమాధానం ఇవ్వాలో నోటి నుండి మాట రాలేదు. వెంటనే అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు






