ఐసీడీఎస్​ కార్యాలయాలు అవినీతిమయం

by velandi.Saikiran |

ఐసీడీఎస్ కార్యాలయాలు అధికారుల అక్రమ వసూళ్ల వ్యవహారాలతో అవినీతి మయంగా మారిపోతుండగా క్రింది స్థాయి ఉద్యోగులు నలిగిపోతున్నారు.

ఐసీడీఎస్​ కార్యాలయాలు అవినీతిమయం
X

ఐసీడీఎస్​ కార్యాలయాలు అవినీతిమయం

=నాడు కరీంనగర్ నేడు రామగుండంలో

=అధికారుల పై అక్రమ ఆరోపణలు

=ఫిర్యాదుల పై ఉన్నతాధికారుల మౌనం

=విచారణ పేరిట కాలయాపణ

=జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు

దిశ, కరీంనగర్ బ్యూరో : ఐసీడీఎస్ కార్యాలయాలు అధికారుల అక్రమ వసూళ్ల వ్యవహారాలతో అవినీతి మయంగా మారిపోతుండగా క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరికి చెప్పుకున్నా చర్యలు కానరాక అధికారులకు మామూళ్లు ఇచ్చుకోలేక వారి గుప్పిట్లో పడి నలిగిపోతున్నారు. గతంలో అధికారుల అవినీతి అక్రమాల పై కరీంనగర్ ఐసీడీఎస్ సిబ్బంది ఆధారాలతో ఫిర్యాదులు చేయగా విచారణ పేరిట ఏళ్లు గడచినా చర్యలు లేకపోవడం తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఐసీడీఎస్ అధికారులు అదేబాటలో నడుస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడటం తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ శాఖలో ఏం జరుగుతుంది అనే చర్చ జోరందుకుంది .

నాడు కరీంనగర్ ఐసీడీఎస్ అధికారులపై అక్రమాల ఆరోపణలు

గతంలో కరీంనగర్ ఐసీడీఎస్​లో పనిచేస్తున్న ఉద్యోగులపై అవినీతి అక్రమ వసూళ్లపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లు వెత్తగా విచారణ పేరిట అధికారులు కాలయాపణ చేయడం తో పై స్థాయిలో అధికారులకు పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పి చర్యలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆధారాలు ఉన్న అక్రమ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఏసీబీ అధికారులకు అజ్ఞాత వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు తూ తూ మంత్రంగా విచారణ చేపట్టి తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపడేయటం లక్షల్లో చేతులు మారాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

రామగుండంలో అధికారుల అక్రమాలపై ఫిర్యాదులు

కరీంనగర్ ఐసీడీఎస్ లో అక్రమాల పై ఫిర్యాదులు వెల్లువెత్తినా చర్యలు లేకపోవడం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండంలో అధికారుల వేధింపులు, అక్రమ వసూళ్లతో నలిగిపోయిన క్రింది స్థాయి ఉద్యోగులు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడం తో అసలు ఐసీడీఎస్​లో ఏం జరుగుతుంది అనే చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది. అయితే రామగుండంలో ప్రమోషన్ల కోసం బదిలీ కావాలన్నా లక్షల్లో వసూల్ చేయడం అందుకు కింది స్థాయి ఉద్యోగుల యూపీఐల ద్వారా నగదును స్వీకరించడం వివాదస్పదంగా మారి ఇప్పుడు ఆ శాఖలో అక్రమ వసూళ్లు కలకలం సృష్టిస్తున్నాయి.

ప్రతి పనికి ఓ రేటు

ప్రమోషన్లు మొదలుకుని బదిలీలు చివరకు సెలవు మంజూరు చేయడం కోసం కూడా డబ్బులు వసూల్ చేయడం పై తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితుల పిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం తో అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమ రాజకీయపలుకుబడిని ఉపయోగించి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక్కడా అంతా మామూళ్లే

ఐసీడీఎస్​ కార్యాలయం అంటేనే అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ శాఖలో టెండర్లలో అవినీతికి పాల్పడ్డా, నిధులు దారిమళ్లించినా ఉద్యోగులకు సెలవు మంజూరు చేయడానికైనా ,బదిలీ కావాలన్న ప్రమోషన్, పొందాలన్నా ప్రత్యేక రేటు ఫిక్స్ చేసి డబ్బులు లాగడం ఆరోపణలు రాగానే పై స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సైతం ప్రత్యేక రేటు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ శాఖలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకుసాగుతున్నారని ఎవరైనా ప్రశ్నించినా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినా పైనుంచి క్రింది వరకు ఆధికారుల వేదింపులు తప్పవనే అబిప్రాయాలు ఆ శాఖ ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి.

అక్రమాల పై అధికారుల నో రెస్పాన్స్

ఐసీడీఎస్ లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న అక్రమాలపై వివరణ కోరేందుకు ఆర్జేడీ (రీజనల్ జాయింట్ డైరెక్టర్ )కార్యాలయం వరంగల్ జిల్లా కేంద్రం లో ఉండటం చేత ఆర్జే డీ శ్రీ ఝాన్సీలక్ష్మిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికి సదరు అధికారిణి ఫోన్​కు స్పందించడం లేదు.

Next Story