- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ వివాదం.. పురుగల మందు తాగి రైతు ఆత్మహత్య
by Bhanu |
సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు అమ్ముల ఐలమల్లు (56) భూ వివాదంతో మానసికంగా బాధపడుతూ రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

X
దిశ, హుజురాబాద్ రూరల్ : సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు అమ్ముల ఐలమల్లు (56) భూ వివాదంతో మానసికంగా బాధపడుతూ రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఆయన మరణించారు.
ఈ విషయంలో బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ.. ‘‘ఐలమల్లు ఆత్మహత్యాయత్నానికి హుజురాబాద్ పోలీసులు కారణమే’’ అని అభిప్రాయపడుతున్నారు. సంఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు కేసు విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. కాగా, మృతునికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Next Story






