- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలి
పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమస్యపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిన ఈ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, హుజరాబాద్ రూరల్ : పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమస్యపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిన ఈ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి...
ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హుజరాబాద్ ప్రజల కష్టాలను తీర్చడానికి రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు,
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
కాంగ్రెస్ ఇన్చార్జ్ వి. ప్రణవ్ బాబు అందరు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హుజరాబాద్ ప్రజలు ఏ నాయకుడినైనా ఆదరించి రాష్ట్ర స్థాయి గుర్తింపు తెస్తారని, ఇప్పుడు ఆ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు వారి వెన్నంటి నిలవాలని కోరారు.
లేఖలో పేర్కొన్న ప్రధాన అంశాలు..
డంపింగ్ యార్డ్ వల్ల కలిగే అనర్థాలను ముజాహిద్ హుస్సేన్ తన లేఖలో వివరించారు.చెత్త నిల్వల వల్ల వెలువడే దుర్వాసనతో గాలి కాలుష్యమై ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోందని, వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై తాగునీరు విషతుల్యంగా మారుతోందన్నారు. దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు.ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, హుజరాబాద్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలి " అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఈ రక్తపు లేఖ ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.






