40 ఏళ్లలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారు..?

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదంటూ రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్య‌క్షులు నందయ్య ప్రశ్నించారు.

40 ఏళ్లలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారు..?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదంటూ రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్య‌క్షులు నందయ్య ప్రశ్నించారు. ఇంతకాలం ఏ ఒక్క‌ కార్యకర్తను కూడా జీవన్ రెడ్డి జగిత్యాల పొలిమేర కూడా దాటనివ్వలేదని అసలు గాంధీభవన్ ఎలా ఉంటుందో కూడా తమకు తెలియదని తెలిపారు. శుక్రవారం జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన విమర్శలకు నందయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈసంద‌ర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇవాళ‌ ఆయన పార్టీని వదిలిపెట్టేవారా అన్నారు. ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ జీవన్ రెడ్డికి ఇచ్చి గౌరవించిందని ఓడిపోయిన ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదనే విషయం గుర్తు చేశారు. హై కమాండ్ ఎమ్మెల్యే తో సమానంగా జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చిందని అయితే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆయన పార్టీని వీడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ దిగిపోవాలని కోరుకుంటున్నారా? కష్ట కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లీడర్ రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై మాట్లాడిన జీవన్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాళేశ్వరం లేకపోతే తెలంగాణ నే లేదు అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే జీవన్ రెడ్డి అంటే ఇప్పటికీ తమకు అభిమానమే అని ఆత్మ విమర్శ చేసుకొని కాంగ్రెస్ తో కలిసి పని చేస్తే తప్పకుండా మీ గౌరవం మీకు ఉంటుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story