- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి రోజు ఊపందుకున్న మద్యం టెండర్లు.. గతంతో పోల్చితే!?
వైన్స్ టెండర్లకు చివరి రోజు దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. చివరి రోజు చాలామంది పాత వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు.

దిశ, కరీంనగర్ టౌన్ : వైన్స్ టెండర్లకు చివరి రోజు దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. చివరి రోజు చాలామంది పాత వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. టెండర్ ఫీజు రూ.3లక్షలు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ సర్కార్కు వచ్చిన ఆదాయం తగ్గలేదు. గతంలో 4040 దరఖాస్తులకు 80.80 కోట్ల ఆదాయం రాగా ఇప్పటివరకు 2187 దరఖాస్తులు రాగా ఈ సంఖ్య మరో 500 పెరిగే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. మొదట్లో నత్తనడకన సాగిన దరఖాస్తులు చివరలో రోజుల్లో వేగం పుంజుకుని ఆఖరి రోజు ఊపందుకుంది. శనివారం రాత్రి ఎక్సైజ్ టెండర్ల స్పెషల్ ఆఫీసర్, ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ టెండర్ల ప్రక్రియను పరిశీలించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో పాటు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు.
గ్రూపులుగా పెద్ద ఎత్తున టెండర్లు..
ఈ సారి వైన్స్ దరఖాస్తుల టెండర్ ఫీజు రూ.3 లక్షలు చేయగా వ్యక్తిగతంగా కొత్తవారు వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. గతంలో తక్కువ ఫీజు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చాలామంది సైతం టెండర్లు వేసేవారు. టెండర్ ఫీజు పెరగడంతో కొత్తవారు రావడం ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి వ్యాపారాలు చేస్తున్నవారు పెద్ద ఎత్తున గ్రూపులుగా ఏర్పడి మద్యం టెండర్లకు దరఖాస్తు చేసుకున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. చాలామంది కొత్తవారు సైతం తలో లక్ష రూపాయలు వేసుకుని చాలా చోట్ల దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇది ఏమైనా అదృష్టాన్ని ఎవరికీ వరిస్తుందనేది ఈనెల 23న తేలనుంది.
Read More..






