- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ టెండర్లపై ఐటీ కన్ను..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు కొనసాగిన ఎక్సైజ్ వైన్సుల టెండర్లపై ఇన్కంటాక్స్ శాఖ కన్ను పెట్టింది. నిన్నట

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు కొనసాగిన ఎక్సైజ్ వైన్సుల టెండర్లపై ఇన్కంటాక్స్ శాఖ కన్ను పెట్టింది. నిన్నటిదాకా రూపాయి టాక్స్ చెల్లించని వారి పేరిట లక్షలాది రూపాయల డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) లు ఎలా సాధ్యమయ్యాయన్న అంశంపై ఆరా తీసే పనిలో ఆ శాఖ పడినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి లిక్కర్ దందా నడుపుతున్న వ్యాపారులు మరోసారి టెండర్లు దక్కించుకునేందుకు భిన్న రకాల ప్రయత్నాలకు దిగారు. మరోవైపు లిక్కర్ దుకాణాలను ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడ కులస్తులకు కేటాయించిన నేపథ్యంలో లిక్కర్ వ్యాపారులు భారీ ఎత్తున బినామీలను రంగంలోకి తెలిపారు. ఈ సమాచారంపైనా ఐటీ శాఖ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా టెండర్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రాత్రి దాకా ఎక్సైజ్ టెండర్ల ప్రక్రియ కొనసాగింది. అధికారులు నిర్దేశించిన సాయంత్రం ఏడు గంటల సమయం దాటిన తర్వాత కూడా కార్యాలయ ప్రిమిసెస్ లో ఉన్న వారందరినీ టెండర్ వేసేందుకు అధికారులు అనుమతించారు. దీంతో రాత్రి 11 గంటల వరకు టెండర్ల ప్రక్రియ నడిచింది. నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో తీవ్ర పోటీ కనిపించింది. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 900 కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ లో 713, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో సుమారు 9 వందల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నది.
వీరిపైనే ఐటి నజర్...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వైన్స్ లకు టెండర్లు నమోదు కావడంతో... ఆదాయ పన్ను శాఖ అనూహ్యంగా తెరపైకి వచ్చిన వారిపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల నుంచి సమాచారం సేకరణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా అసలు ఇన్కమ్ టాక్స్ కట్టకుండా ఉన్నవారు ఒక్కొక్కరు ఒకేసారి ఐదు నుంచి పది దాకా టెండర్ల షెడ్యూల్ దాఖలు చేసిన వారిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇప్పటిదాకా ఐటి శాఖ రికార్డులలో లేని వారు పెద్ద మొత్తంలో ఎక్సైజ్ టెండర్లలో పాల్గొన్నట్లు వారి దృష్టికి వెళ్ళింది. అలాంటి వారి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.
Read More..






