- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేద మంత్రాలకు నిలయం.. మంత్రపురి ఆధ్యాత్మిక శోభ కేంద్రం
మంథని పట్టణానికి ప్రవచన కర్త డాక్టర్ గరికపాటి నరసింహ రావు రానున్నారు.

దిశ, మంథని : మంథని ప్రాంతం అంటేనే వేద మంత్రాలకు నిలయం. ఆధ్యాత్మిక శోభ కేంద్రం.టెంపుల్ టౌన్ గా పిలుస్తుంటారు. మహా లక్ష్మి, గౌతమేశ్వర ఆలయం, దక్షిణ ముఖంగా ఉన్న బైక్షేశ్వర ఆలయంతో పాటు వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్ర ఆలయాలు మంథని ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రంపంచ వ్యాప్తంగా మంథని (మంత్రపుర) ప్రసిద్ధి ఉంది. ఘనమైనా చరిత్ర కూడా ఉంది. మంథని పట్టణంలో ప్రతి రోజు నిత్య పారయాణాలు,వేద ఘోష, భగవనమ స్మరణతో మారు మ్రోగుతుంటుంది. సంధ్య వందనంతో మొదలై సాయం కాలం వరకు దైవ ప్రార్ధనలతో ఆలయాల్లో భగవనమ స్మరణతో ఉట్టి పడుతుంది. నిత్య అన్నదానం కార్యమాలు కూడా నిర్వహిస్తుంటారు. చాగంటి, పరిపూర్ణ నంద స్వామిల ప్రవచన కర్తలు ఆధ్యాత్మికతను ఉట్టి పడేలా తమ భక్తి ఉపన్యాసలతో మంత్ర ముగ్దుల్ని చేశారు. అయితే మంథని పట్టణానికి ప్రవచన కర్త డాక్టర్ గరికపాటి నరసింహ రావు రానున్నారు. ఈ నేపథ్యంలోమంగళ, బుధ, గురు వారాల్లో సాయంత్రం మంథని పట్టణంలోనీ అయ్యప్ప దేవాలయంలో మణికంఠ అయ్యప్ప దేవాలయంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మంగళవారం సాయంత్రం పట్టణంలోనీ గాంధీ చౌక్ నుండి భక్త బృందంచే కోలాటలతో వేద పండితుల వేదా ధ్యయనంతో మంథని పుర విధుల నుండి శోభ యాత్రతో ప్రారంభమై మణికంఠ కళా ప్రాంగణమునకు చేరుకుంటారు. దీంతో గరికపాటి భక్తి ప్రవచనాలు, ఉపన్యాసలతో మంథని పట్టణంలో ఆధ్యాత్మికతను శోభ విలసిల్లుతుంది.






