- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో ఈదురుగాలులతో భారీ వర్షం
by Kema Shiva Kumar |
జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

X
నేలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పు కారణంగా అధిక వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీనితో పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు పట్టణంలోని సుతారిపేట్ చౌరస్తా వద్ద పెద్ద వృక్షం విరిగి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడిపోయింది పురాణి పేట్ ప్రిన్స్ గార్డెన్ వెళ్లే దారిలో చెట్టు విరిగి విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా పలు చోట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Next Story






