దిగువ మానేరుకు భారీగా ఇన్ ఫ్లో..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-12 14:22:39  IST  )

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న దిగువ మానేరు జలాశయానికి రాత్రికి రాత్రే భారీగా ఇన్ ఫ్లో పెరగడంతో వెంటనే ఎస్ఆర్ఎస్పి అధికారులు అప్రమత్తమై అనుక్షణం ప్రాజెక్ట్ లోకి వస్తున్న ఇన్ఫ్లో ను గమనిస్తూ క్రస్ట్ గేట్లు పది ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

దిగువ మానేరుకు భారీగా ఇన్ ఫ్లో..
X

దిగువ మానేరుకు భారీగా ఇన్ ఫ్లో..

- అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు..

- పది గేట్ల ద్వారా దిగువకు 38 వేల క్యూసెక్కుల నీరు విడుదల

- సాయంత్రానికి ఇన్ ఫ్లో తగ్గడంతో 8 గేట్ల ద్వారా నీటి విడుదల..

- ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం 23.5 టీఎంసీలు..

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న దిగువ మానేరు జలాశయానికి రాత్రికి రాత్రే భారీగా ఇన్ ఫ్లో పెరగడంతో వెంటనే ఎస్ఆర్ఎస్పి అధికారులు అప్రమత్తమై అనుక్షణం ప్రాజెక్ట్ లోకి వస్తున్న ఇన్ఫ్లో ను గమనిస్తూ క్రస్ట్ గేట్లు పది ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దిగుమనేరు జలశయానికి మద్య మానేరు జలాశయంతోపాటు కాకతీయ కాలువ నుంచి అధికారులు దాదాపు పదివేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఎల్ఎండీ ప్రాజెక్ట్ అధికారులు గురువారం సాయంత్రం వరకు కేవలం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి వేళ మానేరు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వస్తున్న ఇన్ఫ్లో ను నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్ధరాత్రి సమయంలో 10 గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినప్పటికీ ఇన్ఫ్లో మరింత పెరగడంతో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆరు గేట్లను మూడు ఫీట్ల మేర, నాలుగు గేట్లను రెండు ఫీట్ల మీద ఎత్తి దాదాపు 36వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాగా సాయంత్రానికి ప్రాజెక్ట్ లోకి కొంత ఇన్ఫ్లో తగ్గడం తో రెండు గేట్లను మూసి 8 గేట్ల ద్వారా 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Next Story