భారీగా పీడీఎస్ (రేషన్) బియ్యం పట్టివేత

by Ratna Kumari |

పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్న ఓ లారీని పెద్దపల్లి పట్టణ శివారులోని రంగంపల్లి వద్ద అధికారులు పట్టుకున్నారు.

భారీగా పీడీఎస్ (రేషన్) బియ్యం పట్టివేత
X

దిశ, పెద్దపల్లి : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్న ఓ లారీని పెద్దపల్లి పట్టణ శివారులోని రంగంపల్లి వద్ద అధికారులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని గొండియా ప్రాంతానికి ఓ లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. రంగంపల్లి వద్ద అధికారులు ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అందులో 298.10 క్వింటాళ్ల ప్రభుత్వ పంపిణీ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 13,66,490 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గోపిడి రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్ మహాదేవ్, అతడిని ఆదేశించిన ప్రేమ్ కుమార్‌లపై పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story