నాన్నా.. లే నాన్నా.. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఆత్మహత్య

by Bhanu |

విగత జీవిగా ఉన్న తన తండ్రిని పసి ప్రాయంలో ఉన్న ఓ చిన్నారి నాన్న.. లే.. అంటూ పిలవడం.. వచ్చి రాని సైగలు చేస్తూ.. తలను నిమురుతూ.. లేపడం.. ఈ దృశ్యాలను చూసిన స్థానికులకు గుండె తరుక్కుపోయేలా చేసింది..

నాన్నా.. లే నాన్నా.. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఆత్మహత్య
X

దిశ, తంగళ్ళపల్లి : విగత జీవిగా ఉన్న తన తండ్రిని పసి ప్రాయంలో ఉన్న ఓ చిన్నారి నాన్న.. లే.. అంటూ పిలవడం.. వచ్చి రాని సైగలు చేస్తూ.. తలను నిమురుతూ.. లేపడం.. ఈ దృశ్యాలను చూసిన స్థానికులకు గుండె తరుక్కుపోయేలా చేసింది.. తన తండ్రి ఇక లేడని తెలియని పసి హృదయం నాన్న పైకి లేచి తనను ఆడిస్తాడేమో అనుకొని తాపత్రయం పడింది.. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు... వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న తాడూరి రామ్ కుమార్ అనే యువకుడు ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు..


ఆర్థిక ఇబ్బందులతో తన కుటుంబాన్ని పోషించలేక పోతున్నానని మనస్తపంతో రామ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడడంతో అతని భార్య బోరున విలపించింది. ముగ్గురు పిల్లలు ఉన్న రామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పుడు తాను, తన పిల్లల పరిస్థితి ఏమిటని విలపించడం స్థానికులను కలిచి వేసింది. అంత్యక్రియలకు సైతం డబ్బులు లేక తల్లడిల్లుతోంది. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటుంది.. సహాయం చేయగలిచిన వారు 8331831330 నెంబర్ కు పంపించాలని స్థానికులు కోరారు.



Next Story