సీఎంపై రెండు చోట్ల పోటీ చేస్తా : ఈటల

by Disha Web Desk 23 |   (  Updated:2023-10-12 12:51:34  IST  )

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై తాను పోటీ చేస్తానని, హుజరాబాద్ లో సైతం తాను బరిలో ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

సీఎంపై రెండు చోట్ల పోటీ చేస్తా : ఈటల
X

దిశ,హుజురాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై తాను పోటీ చేస్తానని, హుజరాబాద్ లో సైతం తాను బరిలో ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాను ఎక్కడ తిరిగినా బ్రహ్మాండమైన మద్దతు ప్రజల నుండి వస్తుందని ,అయినా తాను హుజురాబాద్ గడ్డను మరవలేనని అన్నారు. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తే కథానాయకులు మీరే కావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో మాదిరి ఈసారి సైతం డబ్బుల సంచులతో బీఆర్‌ఎస్ నాయకులు వస్తారని, వారి మాటలకు, ప్రలోభాలకు లొంగకూడదని ఆయన కోరారు .

ప్రజల మద్దతు ఉన్న తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానన్నారు. తన గెలుపు చూసి ప్రజలు ఎవరైనా నాయకుడు కావచ్చు అని అనుకుంటున్నారని అన్నారు. డబ్బులు సంచులతో వచ్చిన ప్రజలు వారిని చీదరించుకున్నారని, ప్రజాబలం ముందు ఏ సంచులు నిలబడవని అన్నారు. ఈసారి తనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ రెండేళ్ల కాలంలో ఎంత నరకం అనుభవించామన్నది మనకు తెలుసని ,ఈ బాధలు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టాలని కోరారు.

Next Story