కమిషన్లు వచ్చే పనులకే నిధులు: హరీష్ రావు

by Kodari Anjali |

తమ శాఖల్లో జరుగుతున్న అవినీతి ఈ జిల్లా మంత్రులకే తెలియడం లేదని హరీష్ రావు ఆరోపించారు.

కమిషన్లు వచ్చే పనులకే నిధులు: హరీష్ రావు
X

దిశ, తిమ్మాపూర్: బిఆర్ఎస్ హయాంలో ప్రజా సంక్షేమానికి అవసరమయ్యే స్కీంలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్కాంల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎస్ఐఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. రైతులు ధాన్యం పండించి రెండు నెలలు అయినా ఇప్పటికీ కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయలేదని అన్నారు. కనీసం వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లుకొనే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లలో ఎక్కడ చూసిన గోల్మల్ జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వంలో సీఎం పతారానేబపోయిందని అందుకే తాను చెబితే ఆఫీసర్ వింటలేరు అని సీఎం స్వయంగా అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నట్లు తెలిపారు.

ఆయా శాఖల్లో జరుగతున్న అవినీతి..

తమ ప్రభుత్వంలో ప్రజల అవసరాలను గుర్తించి ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని అన్నారు. అహర్నిశలు ప్రజల కోసం పని చేసిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రతీ స్కీమ్ లో స్కాం.. అన్నట్లు తయారైందని కొన్ని శాఖల్లో జరుగుతున్న అవినీతి కూడా ఆయా శాఖల మంత్రులకే తెలియడం లేదని విమర్శించారు. ఆయా సంక్షేమ శాఖల్లో పిల్లలకు అందించే ఉప్పు, పప్పుల్లో కూడా రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందని తాను ఆరోపిస్తే సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు మా శాఖల్లో ఎలాంటి అవినీతి జరగడం లేదని అంటున్నారని, దీన్ని బట్టి ఆయా శాఖల్లో జరుగతున్న అవినీతి కూడా వారికి తెలియకుండా కేవలం సిఎం రేవంత్ రెడ్డి మాత్రమే అన్నీ అయి చేస్తున్నట్లు అర్థం అవుతుందని అన్నారు. ఈ విషయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు ఇద్దరినీ చూస్తే జాలి వేస్తుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎనుముల కుటుంబ సభ్యులు మాత్రమే కోటిశ్వరులు అయ్యారని విమర్శించారు.

మృగశిర కార్తే వచ్చిన ఇంకా..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని ప్రతీ బడ్జెట్ లో చెప్పడమే గాని ఇప్పటి వరకు కూడా వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం మాట్లాడితే ఖజానా ఖాళీ ఉందని చెబుతున్నాడని ఫ్యూచర్ సిటీ కట్టడానికి, మూసి ప్రక్షాళనకు, సీఎం క్యాంపు ఆఫీస్ లు కట్టడానికి, మెస్సి తో కలిసి ఫుట్బాల్ ఆడేందుకు, అందాల పోటీల నిర్వహణకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో కట్టిన డబ్బులను ఢిల్లీకి దోచుకుపోయి రాహుల్ గాంధీకి అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును యాడ్స్ పేర ఖర్చు పెడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కమిషన్ వస్తే అక్కడే డబ్బులు కేటాయిస్తుందని ఆరోపించారు. అదే ప్రభుత్వ పథకాలకు పేదలకు, రైతులకు కేటాయిస్తే కమిషన్లు రావనే ప్రభుత్వ పథకాలకు నిధులు లేవని చెబుతున్నారని విమర్శించారు. మృగశిర కార్తే వచ్చిన ఇంకా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయంటేనే రైతుల పై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. రైతును నిండా ముంచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతులకు 19 వేల కోట్ల రైతు బంధు బాకీ పడిందని అన్నారు.

రైతులకు రావాల్సిన బోనస్ కూడా..

తమ ప్రభుత్వం లో ఎరువులకు ఎప్పుడు ఇబ్బంది రాలేదని, కాంగ్రెస్ వచ్చాక ఆప్ పెట్టి రైతులను మోసం చేస్తూన్నారని అన్నారు. రైతు భీమా పథకం కూడా నాలుగు నెలలుగా నిలిచిపోయిందని అన్నారు. రైతులకు రావాల్సిన బోనస్ కూడా బోగస్ అయిందని ఆరోపించారు. రైతులకు కరెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదని అన్నారు. త్వరలో రైతు డిస్కమ్ వస్తే ఇక రైతులకు కేవలం 7,8 గంటలే కరెంట్ వస్తుందని అన్నారు. రైతు డిస్కమ్ అమల్లోకి వస్తే 24 గంటల కరెంట్ ఇక ఉత్తదే అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అన్నీ వర్గాల ప్రజలకు ఇబ్బందులే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బీఆర్ఎస్ రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీ రిఎంబర్స్మెంట్ రూ. 30 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు.

ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్..

పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అధికారులు చెబుతుంటే సీఎం మాత్రం కేవలం 5 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ వర్గాలు మోసపోయారని అన్నారు. ఇటీవల భూముల రిజిస్ట్రేషన్ ఫీ లు పెంచి రియల్ వ్యాపారాన్ని మరింత దిగజార్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని అయితే కాంగ్రెస్ ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలపునాదుల పై ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ఎన్ని ఎకరాకు ఇచ్చావు. చూపించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రతీ 20 ఏళ్ల కు ఒక సారి జరుగుతుందని, ఈ నెల 25 నుంచి జులై 25 వరకు కొనసాగుతుందని అన్నారు. పార్టీ నుంచి పూర్తి అవగాహన ఉన్న కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించి ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫిగా సాగేలా చూడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల పై ఉందని అన్నారు. కార్యక్రమం లోఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. వి. రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాలువ మల్లేశం, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గడ్డం నాగరాజు, సోషల్ మీడియా ప్రతినిధి సది గౌడ్ , నాయిని వెంకట్ రెడ్డి, వంతడుపుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story