క్లాసికల్ నృత్య పోటీల్లో సత్తా చాటిన విద్యార్థినులు

by Taduka Kalyani |

అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా ) ఆధ్వర్యంలో అట్లాంటాలో నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ పోటీలలో భారతీయ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో ప్రతిభ చాటిన చిన్నారి హీరా జూనియర్ కేటగిరిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.

క్లాసికల్ నృత్య పోటీల్లో సత్తా చాటిన విద్యార్థినులు
X

దిశ, రవీంద్ర భారతి : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా ) ఆధ్వర్యంలో అట్లాంటాలో నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ పోటీలలో భారతీయ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో ప్రతిభ చాటిన చిన్నారి హీరా జూనియర్ కేటగిరిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. సీనియర్ కేటగిటిలో సాన్వి తృతీయ బహుమతి గెలుచుకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా హీరా, సాన్వి లు అందించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను, పాత్రికేయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ విజయానికి ఆమె గురువు కీర్తి సంజీవ్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయి. చిన్న వయస్సులోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కళాప్రతిభను చాటుతూ అంతర్జాతీయ వేదికపై తెలుగు వారి కీర్తిని నిలబెట్టిన హీరా, సాన్విలను, కళాభిమానులు అభినందించారు. హీరా, సాన్వి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి భారతీయ నృత్య సంప్రదాయ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలని పలువురు ఆకాంక్షించారు.

Next Story