- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
ప్రేమ పెళ్లి పేరుతో యువతిని వేధింపులకు పాల్పడిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

దిశ, తంగళ్లపల్లి : ప్రేమ పెళ్లి పేరుతో యువతిని వేధింపులకు పాల్పడిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఒక యువతిని రుద్రంగికి చెందిన సింగారపు గణేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని బాధిత యువతి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని గణేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. ప్రేమ,పెళ్లి పేరుతో వెంటపడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వేధింపులకు గురైన యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.






