- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హమాలీ కొడుకు జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక
జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి పట్నం కనకయ్య యాదవ్వ దంపతుల కుమారుడు నరేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి పట్నం కనకయ్య యాదవ్వ దంపతుల కుమారుడు నరేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. నిరపేద కుటుంబానికి చెందిన నరేష్ తల్లి దండ్రులు కష్టపడి కుమారుడిని చదివించారు. తల్లి గ్రామంలో రైతు కూలీగా ఉండగా తండ్రి జగిత్యాల పట్టణంలో గత 20 సంవత్సరాలుగా హమాలి పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నరేష్ సైతం చదువుపై ఉన్న మక్కువ కారణంగా కష్టపడి చదువుకున్నాడు. లాసెట్ లో మంచి ర్యాంకు పొందడంతో 2017 లో హైదరాబాద్ అంబేద్కర్ లా కాలేజీ లో సీటు సంపాదించి ఎల్ఎల్బి పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేసాడు. ఆర్థికంగా కుటుంబం వెనుకబడి ఉండడంతో నరేష్ పూర్తిగా తల్లిదండ్రుల కష్టంపై ఆధారపడకుండా ఓవైపు చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 30న విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పేద కుటుంబం నుంచి వచ్చి జడ్జిగా ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి వెళ్లడం పట్ల నరేష్ ను పలువురు అభినందించారు.






