మామిడికి వ‌డ‌గండ్ల దెబ్బ

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, తిమ్మాపురం గ్రామాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకు ఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయి.

మామిడికి వ‌డ‌గండ్ల దెబ్బ
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం తిమ్మాపురం గ్రామాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకు ఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. మ‌రోవైపు చెట్లు కూడా నేల కూల‌డంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో రైతన్న‌లకు అపార న‌ష్టం వాటిల్లింది. రైతులు లబోదిబోమంటున్నారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీమన్న అనే రైతు ముదిరాజు సంఘానికి చెందిన‌ మామిడి తోటను ఐదు లక్షల రూపాయలకు తీసుకున్నాడు. కోతుల భారీ నుంచి మామిడి తోటను కాపాడుకున్నప్పటికీ పకృతి కన్నీరు చేసి వడగండ్ల‌ వానతో పాటు ఈదురు గాలులకు మామిడికాయలన్నీ నేలరాలిపోవ‌డంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తిమ్మాపూర్ నుంచి గుండారం సముద్రం లింగాపూర్ వెళ్లే దారి పక్కన చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. దీంతో తీవ్రంగా నష్టపోయానని భీమన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది విద్యుత్ సిబ్బంది నేలకూలిన‌ స్తంభాలను పునరుద్దరించి వ్యవసాయ పొలాల‌కు, గృహాలకు విద్యుత్ సరఫరా పునద్ధరించారు.

Next Story