గుడాల శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక ‘కలం రత్న’ పురస్కారం

by Nallavelli.Anjaneyulu |

పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గన్నేరువరం మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, దిశ దినపత్రిక మండల రిపోర్టర్ గుడాల శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన “కలం రత్న” పురస్కారం లభించింది.

గుడాల శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక ‘కలం రత్న’ పురస్కారం
X

దిశ, గన్నేరువరం: పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గన్నేరువరం మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, దిశ దినపత్రిక మండల రిపోర్టర్ గుడాల శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన “కలం రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి చేతుల మీదుగా గుడాల శ్రీనివాస్ అవార్డును అందుకోవడం విశేషంగా నిలిచింది. సమాజ సమస్యలను వెలికితీసే ధైర్యవంతమైన జర్నలిజం, ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, సహచర జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందని పలువురు అభిప్రాయపడ్డారు.


రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, టీఆర్ఎస్ నాయకుడు నాలేశ్వరం శంకర్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు వైద్యుల మధుకర్ గుడాల శ్రీనివాస్‌ను అభినందించారు.ఇదిలా ఉండగా, “కలం రత్న” పురస్కారం అందుకోవడం పట్ల డబ్ల్యుజేఐ రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రానా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి శివనాధుని ప్రమోద్ కుమార్ అభినందనలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథ రెడ్డి, కోశాధికారి చిట్టిమల్ల మహేందర్, కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి, పులి సంతోష్ గౌడ్, జాలి నరేష్ రెడ్డి, మండల సభ్యులు పాశం ఎల్లయ్య, ఓరగంటి సంపత్, భీమనాది వెంకటేష్, ఓడ్నాల తిరుపతి, నేరెళ్ల నరేష్ గౌడ్, మాదాపూర్ సర్పంచ్ మేదరి శ్రీనివాస్ తదితరులు గుడాల శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story