- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికి ఒకరోజు ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు
పెళ్లి తీరని పెనుగులాటగా మారిన సంఘటన కాట్రపల్లి గ్రామంలో కలకలం రేపుతోంది. నేడు పెళ్లి జరగాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరుడు, అంతకుముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : పెళ్లి తీరని పెనుగులాటగా మారిన సంఘటన కాట్రపల్లి గ్రామంలో కలకలం రేపుతోంది. నేడు పెళ్లి జరగాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరుడు, అంతకుముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... నేడు పెళ్లి జరగాల్సి ఉండగా మరో అమ్మాయితో నిన్న పెళ్లి చేసుకున్న వరుడి ఉదంతం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన వధువు పెళ్లి ఆగిపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి ఒకరోజు ముందు మరో అమ్మాయితో పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారు.
పోలీసులు, బాధితుల కథనం మేరకు... రంగాపూర్ గ్రామానికి కుంట శ్రీనివాస్ రెడ్డి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డి అనే యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కాట్రపల్లికి చెందిన యువతీతో పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. రూ.40 లక్షల విలువైన ఎకరం భూమి, పది తులాల బంగారం, ఆరు లక్షల నగదుతో కట్న కానుకలు మాట్లాడుకున్నారు.అనంతరం నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉండగా నిన్న ఉదయం మరో అమ్మాయితో మధుకర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అబ్బాయి తండ్రి కుంట శ్రీనివాస్ రెడ్డిని వెళ్లి అడగగా ఏమి చేసుకుంటారో చేసుకోమని దబాయిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు వాపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






