సెప్టెంబర్‌ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్‌ జాబితా

by velandi.Saikiran |

సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే అన్నారు.

సెప్టెంబర్‌ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్‌ జాబితా
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డులలో ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేస్తామని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు. ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు ఎంపిడిఓ కార్యాలయంలోఅందించాలని అన్నారు.

సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేస్తారని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వి. జగదీశ్వర్ , కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్,బిజెపి పార్టీ ప్రతినిధి వాసాల రమేష్, నాంపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, సిపిఐ పార్టీ ప్రతినిధులు మిల్కూరి వాసుదేవా రెడ్డి, సిపిఎం కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజు, ఎంఐఎం పార్టీ ప్రతినిధులు సయ్యద్ గులాం అహ్మద్, బర్కత్ ఆలి, టిడిపి పార్టీ ప్రతినిధికళ్యాడపు ఆగయ్య, బీఎస్పీ పార్టీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Next Story