- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం గౌరవ వేతనమివ్వాలి..
by Kema Shiva Kumar |
జగిత్యాల జిల్లాలోని రేషన్ డీలర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.

X
కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల నిరసన
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలోని రేషన్ డీలర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కమీషన్ కాకుండా ప్రభుత్వం తమకు గౌరవ వేతనమివ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే కమిషన్ సరిపోక దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని రేషన్ డీలర్లు తెలిపారు. కరోనా వైరస్ వంటి కష్ట సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందించామని అలాంటి తమను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.
Next Story






