- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలను కోటిశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్యం
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

దిశ, వెల్గటూర్ : మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పై తొలి సంతకం చేసి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అండగా నిలిచారని ఉద్ఘాటించారు. వడ్డీలేని రుణాలు అందజేయటం జరుగుతుందని మంత్రి అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజ లో ఉండేందుకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడిపించుకునే అవకాశం, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఇతర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అంద చేస్తుందన్నారు.
మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి జరుతున్న సహకారమే అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు సంఘటితంగా ఆర్థిక అభివృద్ధి సాధిం చాలని మంత్రి పిలుపు నిచ్చారు. రాజారాం పల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలో మటన్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మరిన్ని పథకాలను తీసుకు రావడానికి కృషి చేస్తా మన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి హామీ కోసం అవకాశాలు కల్పించాలని గ్రామ సర్పంచ్ సంగ రమేష్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ లత, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, మద్దుల గోపాల్ రెడ్డి, ఎంపీఓ కృపాకర్ పాల్గొన్నారు.






