- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాం : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందజేయడమే లక్ష్యం అని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

దిశ, గోదావరిఖని : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందజేయడమే లక్ష్యం అని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. బుధవారం గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 18 స్కూటీలు, 7 ల్యాప్‌టాప్‌లు, 1 ఆధునిక 5G మొబైల్, 2 టాబ్‌లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ పరికరాలు వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించి, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతాయని పేర్కొన్నారు. అంగన్ వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 203 మంది అంగన్ వాడి సిబ్బందికి 5G మొబైల్స్‌ను అందజేశారు. ఈ సాంకేతిక పరికరాల ద్వారా సేవలు వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని తెలిపారు. 37వ డివిజన్‌కు చెందిన ఒక ఆయా సిబ్బందికి అంగన్వాడీగా పదోన్నతి కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, నేల కంటి రాము, ధూళికట్ట సతీష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.






