ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకే తొలిపొద్దు..

by Kodari Anjali |

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసెందుకే తొలిపొద్దు కార్యక్రమం అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకే తొలిపొద్దు..
X

దిశ, తిమ్మాపూర్: ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసెందుకే తొలిపొద్దు కార్యక్రమం అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం పొలంపెల్లి గ్రామంలో తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీ.ఆర్. ఎస్ పార్టీ నాయకుడు మల్లయ్య యాదవ్ తల్లి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ బొజ్జ తిరుపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story