ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలం :  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు కేటాయించిన నిధులు ప్రజల ఆశలకు, రాష్ట్ర అవసరాలకు సరిపోకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన గుర్తుచేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు.అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.ప్రస్తుత బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయించిన నిధులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల కొరత నివారణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే కార్యక్రమాలకు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యారంగానికి 26,674 కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో విద్యకు 8.22 శాతం మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ లో గత సంవత్సర కేటాయింపుల కంటే ఇది కేవలం 0.63 శాతం మాత్రమే పెంచి కేటాయింపులను 8.22 శాతంకు కుదించారనీ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2024-25 లో 7.3 శాతం, రెండవ సంవత్సరం 2025-26 లో 7.57 శాతం, ప్రస్తుత బడ్జెట్లో 8.22 శాతం మాత్రమే కేటాయించింది.కానీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తానిచ్చిన హామీనీ సైతం నిలబెట్టుకోక పోవడం శోచనీయం అనీ అన్నారు..అలాగే వైద్య రంగంలో కూడా ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య సిబ్బంది నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల బలోపేతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో సామాన్య ప్రజల అవసరాలు పక్కనపెట్టబడినట్టు కనిపిస్తోందని, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలకు తగిన నిధులు లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

Next Story