- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రైతులతో చెరుకు ఫ్యాక్టరీ కమిటీ సభ్యుల ముఖాముఖి కార్యక్రమం
హాజరైన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
దిశ, మల్లాపూర్/మెట్ పల్లి : షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్యర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉందని, బ్యాంక్ లకు డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర, సీడ్, హార్వెస్టింగ్ అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతులకు చెరుకు సాగులో ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. చెరుకు సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని, ఫ్యాక్టరీని విజయవంతంగా ప్రారంభించుకుంటామని అన్నారు. బ్యాంక్ లకు ప్రభుత్వం రూ.176 కోట్లు చెల్లించిందని, 20వేల ఎకరాల్లో చెరుకు పంటను రైతులు సాగు చేస్తారని అన్నారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ప్రారంభానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, చెరుకు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల హార్వెస్టింగ్ సీడ్ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రఘునందన్ రావు, ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.






